Waqar-uz-Zaman: బంగ్లా ఆర్మీ అత్యవసర సమావేశం.. 7 d ago

బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ - ఉజ్- జమాన్ నేతృత్వంలో ఆర్మీ వర్గాలు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం. యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి బంగ్లా ప్రజల్లో అశాంతి, అపనమ్మకం పెరిగిందని, దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో ఆర్మీ పాత్ర ఎక్కువగా ఉంటుందనే దానిపై అధికారులు చర్చించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని లేదా యూనస్ పై తిరుగుబాటు చేయాలని సైన్యం యూనస్ పై ఒత్తిడి తీసుకురావచ్చని సంబంధిత వర్గాలు సూచించాయి.